శుక్రవారం నాటి ట్రెండ్(Trend)ను కొనసాగిస్తూ ఈ రోజు కూడా స్టాక్ మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి. BSE సెన్సెక్స్, NSE నిఫ్టీ జీవితకాల గరిష్ఠాల(Life Time High)కు చేరుకున్నాయి. తొలిసారి BSE సెన్సెక్స్ 77,000 మార్క్ దాటి 77,150 పాయింట్లకు చేరుకుంటే.. NSE నిఫ్టీ 23,500 పాయింట్లు దాటింది. అంతర్జాతీయంగానూ, దేశీయ మదుపుదారుల్లోనూ సానుకూల పవనాల(Possitive Waves) దృష్ట్యా మంగళవారం నాడు స్టాక్ మార్కెట్లు లాభాల దిశగా దూసుకెళ్లాయి.