స్టాక్ మార్కెట్లు(Stock Markets) భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ ఒడిదొడుకులతో BSE సెన్సెక్స్ 80,000 పాయింట్ల దిగువకు పడిపోయింది. సెన్సెక్స్ 1,457 పాయింట్లు నష్టపోయి 79,524.75 వద్ద ట్రేడయింది. నిఫ్టీ(Nifty) సైతం 446 పాయింట్లు కోల్పోయి 24,272.10 వద్ద కొనసాగుతున్నది.
గ్లోబల్ మార్కెట్లు గణనీయమైన అల్లకల్లోలాన్ని చవిచూస్తే.. ఆసియా మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యం(Recession) వైపు పయనిస్తుందనే అనుమానాల నడుమ వడ్డీ రేట్లలో భారీ మార్పులుండనున్నాయన్న ఊహాగానాలతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి.
సన్ ఫార్మా, హిందూస్థాన్ యూనిలీవర్, ఏషియన్ పెయింట్స్, నెస్లె(Nestle) లాభాల్లో కొనసాగుతుండగా… టాటా మోటార్స్, టాటా స్టీల్, మారుతీ సుజుకి, RIL, JSW స్టీల్, M&M నష్టాల్లో నడుస్తున్నాయి.