దేశవ్యాప్తంగా బంగారం(Gold), వెండి(Silver) ధరలు భారీగా పతనమయ్యాయి. ఒక్కరోజులోనే ఇంచుమించు రూ.1,000 దాకా తగ్గాయి. దీంతో నాలుగు రోజుల వ్యవధిలోనే బంగారం రూ.1,300కు పైగా, వెండి రూ.1,600 దాకా తగ్గినట్లయింది. దేశీయ మార్కెట్ లో ఈ రోజు 10 గ్రాముల పసిడి రేట్ రూ.60,094గా ఉంది. ఇది బుధవారం నాడు రూ.61,075గా అమ్ముడైంది. ఈ లెక్కన కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే రూ.981 తగ్గింది. ఇక వెండి ఈ రోజు రూ.73,365కు చేరుకోగా, ఇది నిన్న రూ.74,315కు అమ్ముడైంది. ఇలా ఒక్క రోజులోనే రూ.950 తగ్గిందని బులియన్ మార్కెట్ వర్గాలను బట్టి అర్థమవుతుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు మార్కెట్లలోనే ఇవే ధరలు అందుబాటులో ఉన్నాయి.
మొన్న సోమవారం నాడు పుత్తడి రేట్ రూ.61,400 ఉంటే ఈ రోజు రూ.60,094కు చేరుకుని ఈ నాలుగు రోజుల్లోనే రూ.1,306 మేరకు తగ్గింది. ఇక వెండి సోమవారం నాడు రూ.75,915 ఉంటే ఈ రోజు రూ.73,365 నమోదు కాగా.. నాలుగు రోజుల వ్యవధిలో రూ.2,550 తగ్గినట్లయింది.
గమనిక: ఈ ధరలు ఇవాళ పొద్దున మార్కెట్ ప్రారంభంలో నమోదయ్యాయి. మార్కెట్ మార్పుచేర్పుల తీరును బట్టి ఇవి మారే అవకాశముంది… గమనించగలరు.