ఎగ్జిట్ పోల్స్(Exit Polls)తో ఎగబాకి ఎలక్షన్ రిజల్ట్స్ తో అథఃపాతాళానికి పడిపోయిన స్టాక్ మార్కెట్లు.. NDA కూటమిదే పీఠం కావడంతో ఈరోజు కోలుకున్నాయి. కొత్తగా ఏర్పడబోయే మోదీ సర్కారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందోనన్న ఆశల నడుమ BSE సెన్సెక్స్, NSE నిఫ్టీ భారీ లాభాలు నమోదు చేశాయి. 2.303 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ 74,382.24 వద్ద.. 736 పాయింట్లు లాభం నమోదు చేసిన నిఫ్టీ 22,620.35 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగిసింది.
బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో కొనసాగడంతో మదుపరులు(Investors) ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం నాడు 32 లక్షల కోట్ల సంపద ఆవిరవడం.. బుధవారం 3 శాతం మేర లాభపడి పలు రంగాలకు బలం చేకూర్చినట్లయింది.