మద్యం(Liquor) మినహా ఆహార పదార్థాల దుకాణాలు GHMC పరిధిలో అర్థరాత్రి 1 గంట వరకు తెరచుకునేందుకు పోలీసులు అనుమతినిచ్చారు. హైదరాబాద్ లో రాత్రి 10 గంటలకే దుకాణాల(Shops) మూతపై విమర్శలు వస్తున్న వేళ.. ఉన్నతస్థాయి ఆదేశాల మేరకు మూడు కమిషనరేట్ల పరిధిలో సమయాన్ని పెంచారు. వస్త్ర, నగల, ఎలక్ట్రానిక్స్ దుకాణాలు, సూపర్ మార్కెట్ల వంటివన్నీ పొద్దున 9 గంటల నుంచి రాత్రి 11 వరకు తెరిచి ఉంటాయి.
వైన్స్ లకు ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు అనుమతిచ్చారు. GHMC పరిధితోపాటు 5 కిలోమీటర్ల వరకు ఉన్న ప్రాంతాల్లోని బార్ల(2బీ)లో మద్యం సప్లై మాత్రం ఉదయం 10 రాత్రి 12 వరకు(సోమ నుంచి గురువారం వరకు), రాత్రి 10 నుంచి అర్థరాత్రి ఒంటి గంట వరకు(వీకెండ్స్) అనుమతి ఉంటుంది.
రాష్ట్రవ్యాప్తంగా…
ఆహార విక్రయాలకు సంబంధించిన దుకాణాలు ఇక రాష్ట్రవ్యాప్తంగా అర్థరాత్రి వరకు తెరచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. పొద్దున 5 గంటల నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు తెరచి ఉంచకోవచ్చు. హోటళ్లు, రెస్టరెంట్లు, దాబాలు, టిఫిన్ సెంటర్లు, బేకరీల వంటి షాపులు అర్థరాత్రి 1 గంట వరకు పనిచేసుకోవడానికి పర్మిషన్ రాగా.. దీనిపై అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉంది.