GST సంస్కరణలతో కార్ల ధరలు బాగా తగ్గుతున్నాయి. సాధారణ కార్లు 28% నుంచి 18% శ్లాబులోకి రాగా, లగ్జరీవి 40 శాతంగానే ఉన్నాయి. ఒక్కో వాహనం ధర 5% నుంచి 8% తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
కంపెనీలు-మోడల్స్ లో తగ్గనున్న ధర
మహీంద్రా: బొలేరో 1.27, స్కార్పియో 1.45, రాక్స్(ROXX) 1.33, XUV700 1.43 లక్షలు
టాటా: నెక్సాన్ 1.55, సఫారి 1.45, వ్యాన్లు, బస్సులు 1.2 నుంచి 4.35 లక్షలు
టొయోటో కిర్లోస్కర్: ఫార్చ్యూనర్ 3.49, లెజెండర్ 3.34, హైలక్స్ 2.52, వెల్ ఫైర్ 2.78, ఇన్నోవా క్రిస్టా 1.8, హైక్రాస్ 1.15 లక్షలు
రెనాల్ట్ ఇండియా: క్విడ్ 4.29 లక్షల నుంచి ప్రారంభం.. (ట్రైబర్ రూ.78 వేలు, టాప్-ఎండ్ కైజర్ రూ.98 వేలు)
హ్యుందాయ్: టక్సన్ 2.40, వెన్యూ 1.23 లక్షలు.. (ఐ20 98 వేలు, అల్కజార్ 75 వేలు)
ఆడి ఇండియా: Q3 3.07, A4 2.64, A6 3.64, Q5 4.55, Q7 6.15, Q8 7.8 లక్షలు