ప్రయాణాలకయ్యే మొత్తం ఖర్చులో టోల్ బాదుడే ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక నుంచి ఆ బాధలు తప్పేలా కొత్త పాలసీ తయారవుతోంది. టోల్ ఛార్జీలు స్వల్పం(Lower)గా ఉండేలా కొత్త విధానం తెస్తున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా, హైవే శాఖల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఏడాదికి ఒకసారి లేదా 15 సంవత్సరాల లెక్కన మరోలా ముందుగానే సింగిల్ పేమెంట్లో ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన వార్షిక, లైఫ్ టైమ్ చెల్లింపుల విధానం అతి త్వరలోనే అందుబాటులో రాబోతున్నది. ఏడాదికి గాను రూ.3,000.. 15 సంవత్సరాల(Life Time)కు గాను రూ.30,000 ఉండనున్నట్లు తెలుస్తోంది. శాటిలైట్ బేస్డ్ టోలింగ్ పై మంతనాలు సాగుతున్నాయని మంత్రి.. రాజ్యసభలో సమాధానమిచ్చారు. https://justpostnews.com