Published 28 Dec 2023
ఆఫర్ వస్తే గానీ స్పందించని తీరు పెండింగ్ చలాన్ల(Pending Challans) విషయంలోనూ మరోసారి కనపడింది. అవకాశం కల్పించిన రెండున్నర రోజుల్లోనే భారీగా ఆదాయం సమకూరింది. ఈ నెల 26న మధ్యాహ్నం మొదలైన చలాన్ల వసూళ్ల ప్రక్రియకు కేవలం రెండున్నర రోజుల వ్యవధిలోనే రూ.8.44 కోట్ల ఆదాయం వచ్చిపడింది. గతంలో కేవలం హైదరాబాద్ లోని మూడు కమిషనరేట్ల పరిధిలోనే భారీగా కలెక్షన్లు రాగా.. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా స్పందన కనిపిస్తోంది. దీంతో వాహనాదారుల దెబ్బకు సర్వర్ హ్యాంగ్ అయిపోయింది.
పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకునేందుకు ఈ నెల 26 నుంచి జనవరి 10 వరకు డిస్కౌంట్ విధానం అమలవుతోంది. ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్లకు 90 శాతం రాయితీ ఇస్తున్నారు. ఇక టూవీలర్లకు 80%, ఆటోలు, ఫోర్ వీలర్స్ కు 60% రాయితీ ఉంటుంది. భారీ వాహనాల(Heavy Vehicles)కు 50 శాతం రాయితీ ఇస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రెండు కోట్లకు పైగా చలాన్లు పెండింగ్ లో ఉండగా.. ఆన్ లైన్ తోపాటు మీసేవ కేంద్రాల్లోనూ క్లియర్ చేసుకోవచ్చు.
చెల్లింపులు,ఇలా…
రాష్ట్రవ్యాప్తంగా 9.61 లక్షల చలాన్లకు చెల్లింపులు
వచ్చిన ఆదాయం రూ.8.44 కోట్లు
హైదరాబాద్ పరిధిలో 3.54 లక్షల చలాన్లకు చెల్లింపులకు
హైదరాబాద్ పరిధిలోనే రూ.2.62 కోట్ల వసూళ్లు
సైబరాబాద్ పరిధిలో 1.82 లక్షల చలాన్లకు చెల్లింపులు
సైబరాబాద్ పరిధిలో రూ.1.8 కోట్ల రాబడి
రాచకొండ పరిధిలో 93,000 చలాన్లకు కలెక్షన్లు
రాచకొండ పరిధిలో రూ.76.79 లక్షలు వసూళ్లు