సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ లోగో మారింది. ట్విటర్ ను కొనుగోలు చేశాక తరచూ మార్పులకు శ్రీకారం చుడుతున్న ఎలాన్ మస్క్.. ఇప్పుడు ‘లోగో’ను కూడా ఛేంజ్ చేస్తున్నారు. లోగోను ‘ఎక్స్(X)’ గా మార్పు చేసినట్లు సంస్థ యాజమాన్యం ప్రకటించింది. ట్విటర్ లోగోలో కనిపించే పక్షికి బదులుగా ఆ స్థానంలో ‘ఎక్స్’ను చేర్చిన మస్క్.. ట్విటర్ వెబ్ సైట్ ను కూడా ఎక్స్ డాట్ కామ్(X.com)తో అనుసంధానించారు.