మొన్నటిదాకా బర్డ్ ఫ్లూ(Bird Flu) ఎఫెక్ట్ తో గిరాకీ లేని చికెన్ కు ప్రస్తుతం డిమాండ్ ఏర్పడింది. దీంతో రేట్లు ఊహించని లెవెల్లో పెరిగిపోయాయి. చాలా చోట్ల రూ.260 నుంచి రూ.280 దాకా ఉంటే, హైదరాబాద్ లో రూ.300కు చేరింది. ఉష్ణోగ్రతలు(Temparatures)పెరగడం, కోళ్లు మృత్యువాత పడటంతోనే ధరలు కొండెక్కాయి. నిన్నటి వరకు సాధారణ స్థితిలోనే రూ.220కు అమ్ముడైంది. కానీ ఉగాది, రంజాన్ తర్వాత మరో రూ.80 అదనంగా చేరింది. కోడి పిల్లలు సాధారణ రోజుల్లో కిలోన్నర బరువు రావడానికి 40 రోజులు పడుతుంది. కానీ ఎండాకాలంలో మాత్రం 60 రోజులు తీసుకుంటుంది. ఇలా ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ లో ఎలాంటి తగ్గుదల లేకపోవడంతో రేట్లు పెరుగుతుంటాయని చెబుతున్నారు. మరిన్ని వార్తలకు https://justpostnews.com క్లిక్ చేయండి.