ఈ రోజుల్లో అత్యంత సులువుగా లోన్ తీసుకునే అవకాశమున్నది కేవలం సిబిల్ స్కోరు పైనే. అసలు సిబిల్ అంటే ఏంటి.. స్కోరును ఎలా లెక్కిస్తారు.. అనే విషయాలపై చాలా మందిలో సంశయాలున్నాయి. సిబిల్ స్కోర్ అనేది ‘క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్(CIBIL)’ నుంచి ఇచ్చే మూడంకెల సంఖ్య. ఒక వ్యక్తికి సంబంధించిన రుణాలు, వాటి చెల్లింపుల(Pays)ను బట్టి వివరాలుంటాయి. ఎంత లోన్ తీసుకున్నారు.. తీసుకున్నవి కరెక్ట్ గా చెల్లిస్తున్నారా అన్న వాటిపై క్రెడిట్ కార్డ్ లావాదేవీలు రికార్డవుతాయి. సిబిల్ స్కోరు ఎక్కువగా ఉంటే లోన్ పొందడం సులభం కాగా మనం కోరుకున్నంత ఇచ్చే ఛాన్స్ ఉంది. స్కోర్ తక్కువగా ఉంటే లోన్ రాదని కాదు.. కానీ ఒక బ్యాంకు కాకుండా మరిన్ని తిరగాల్సి ఉంటుంది. ఎక్కువ స్కోరు ఉంటే తక్కువ వడ్డీకి, తక్కువ స్కోర్ ఉంటే లోన్లను ఎక్కువ వడ్డీ రేట్ తో ఇస్తాయి.
సిబిల్ స్కోరు 300 నుంచి 900 లోపు ఉండగా… 300-619 వరకు పూర్, 620-659 వరకు ఫెయిర్, 660-719 గుడ్, 720-749 గ్రేట్, 750-850 ఎక్సలెంట్ గా చూస్తారు. ఎక్సలెంట్ కేటగిరీ వ్యక్తులకు తక్కువ వడ్డీకే లోన్లు ఇచ్చేందుకు బ్యాంకులు పోటీపడుతుంటాయి. హోం, కార్ లోన్లను సెక్యూర్డ్ గా.. పర్సనల్, క్రెడిట్ కార్డ్ లోన్లను అన్ సెక్యూర్డ్ గా లెక్కిస్తారు. క్రెడిట్ లిమిట్ ను ప్రతి నెలా పూర్తిగా వాడకుండా అందులో 30 శాతం మాత్రమే ఉపయోగించాలి. ఇంతకన్నా ఎక్కువగా యూజ్ చేస్తే స్కోరుపై ప్రభావం పడుతుంది. క్రెడిట్ స్కోరు తెలుసుకోవాలంటే సిబిల్ అధికారిక వెబ్ సైట్ www.cibil.comలోకి వెళ్లాలి. వ్యక్తిగత వివరాలు పూర్తి చేస్తే వెంటనే క్రెడిట్ రిపోర్ట్ వచ్చేస్తుంది. ఈ క్రెడిట్ రిపోర్ట్ అనేది ప్రతి సంవత్సరం మాడిఫికేషన్ అవుతుంటుంది.
క్రెడిట్ స్కోరు పెరగాలంటే…
గతంలో తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లించడం
సమయానికి EMI కట్టడం
సెక్యూర్డ్, అన్ సెక్యూర్డ్ లోన్ల మధ్య బ్యాలెన్స్ పాటించడం
క్రెడిట్ లిమిట్ ను పరిమితిగా వాడటం