ఏ వస్తువు కొనాలన్నా క్రెడిట్ కార్డ్…
ఇన్సూరెన్స్ ప్రీమియంకు క్రెడిట్ కార్డ్…
మెడికల్ బిల్లులకూ క్రెడిట్ కార్డ్…
దేశంలో ఆన్ లైన్(Online) లావాదేవీ(Transactions)లు ఎంతగా పెరిగిపోతున్నాయో క్రెడిట్ కార్డుల వాడకమూ అలాగే ఉంది. బ్యాంకుల మీద బ్యాంకులు ఇచ్చే క్రెడిట్ కార్డులే ఇప్పుడు లక్షల కోట్ల వ్యాపారం చేస్తున్నాయి. బ్యాంకులను బట్టి 45 నుంచి 50 రోజుల చెల్లింపు పరిమితి ఉండే ఈ కార్డులతో షాపింగ్ వ్యవస్థ భారీ స్థాయిలో ఉంటున్నది. అలా ఒక్క నెలలోనే సరికొత్త రికార్డులు క్రియేటయ్యాయి.
మార్చిలో…
నెలనెలా GST వసూళ్లు లక్షన్నర కోట్లు దాటితే… 2024 మార్చి నెలలోనే క్రెడిట్ కార్డుల ట్రాన్జాక్షన్స్ రూ.1,00,000(లక్ష) కోట్లు దాటాయి. ఇది 2023 మార్చి(రూ.86,390 కోట్ల)తో పోలిస్తే 20% అధికం కాగా.. 2024 ఫిబ్రవరి(రూ.94,774 కోట్ల)తో పోల్చుకుంటే 10% ఎక్కువ. ఇక ఆఫ్ లైన్ ట్రాన్జాక్షన్స్(Point Of Sale Machines) ఈ మార్చిలో రూ.60,378 కోట్లు కాగా.. గత మార్చి(రూ.50,920 కోట్ల)తో పోలిస్తే 19% శాతం ఎక్కువ.
మొత్తంగా…
ఆన్ లైన్, ఆఫ్ లైన్ కలిపితే మొత్తంగా ఈ మార్చిలో రూ.1,64,586 కోట్లల్లో లావాదేవీలు జరగ్గా… ఇది 2023 మార్చిలో 1,37,310 కాగా అప్పటికి ఇప్పటికీ 20% తేడా ఉంది. 2024 ఫిబ్రవరిలో క్రెడిట్ కార్డుల సంఖ్య 10 కోట్లకు చేరుకోగా.. మార్చి ముగిసేనాటికి అవి 10.2 కోట్లకు పెరిగాయి. గత సంవత్సరం ఇది 8.5 కోట్లు కాగా.. ఇందులోనూ 20% శాతం వృద్ధి కనిపించింది. హయ్యెస్ట్ కార్డులు ఇచ్చిన టాప్ 10 బ్యాంకుల వాటానే 90%గా ఉంది.
స్థానం బ్యాంకు వాటా
1 హెచ్.డి.ఎఫ్.సి. 20.2%
2 ఎస్.బి.ఐ. 18.5%
3 ఐసీఐసీఐ 16.6%
4 యాక్సిస్ 14%
5 కొటక్ మహీంద్రా 5.8%