దేశంలోని ప్రతి పల్లెలో డిజిటల్ ట్రాన్జాక్షన్స్ ను అమలు చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన విధివిధానాలు ప్రకటించింది. పూర్తి ట్రాన్స్ పరెన్సీ ఉండాలన్న లక్ష్యంతో అన్ని కార్యక్రమాలకు చేపట్టే కేటాయింపుల్ని డిజిటల్ వేదికగానే సాగాలని నిర్ణయించింది. ఈ మేరకు అభివృద్ధి పనులు, టాక్స్ కలెక్షన్స్ వంటివన్నీ ఇక నుంచి గ్రామ పంచాయతీలు డిజిటల్ పేమెంట్ల ద్వారా నిర్వహించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 15 తర్వాత అన్ని GPలను… UPI వాడుతున్న గ్రామాలుగా ప్రకటిస్తామని స్పష్టం చేసింది.
ప్రజాప్రతినిధులదే బాధ్యత
ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని సీఎం, ఎమ్మెల్యేలు సహా ప్రజాప్రతినిధులందరూ ఘనంగా నిర్వహించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. పంచాయతీలు ఈ నెల 30 నాటికి సర్వీసు ప్రొవైడర్లతో సమావేశం కావాలని సూచించిన కేంద్రం… ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, భారత్ పే, భీమ్, మొబిక్విక్, అమెజాన్ పే, వాట్సప్ లో అనువుగా ఉన్న వాటిని ఎంచుకోవాలని కోరింది. ఈ నెల 30 లోపు ఆ ప్రక్రియ పూర్తి కావాలని.. అనంతరం జిల్లా, బ్లాకు స్థాయిలో ట్రైనింగ్ సెంటర్స్ నిర్వహిస్తామని తెలిపింది.