రాష్ట్ర ఖజానాకు కాసులు కురిపించిన మద్యం దుకాణాల వేలానికి సంబంధించి ఈ రోజు డ్రా నిర్వహించనున్నారు. ఈ లక్కీ డ్రా ద్వారా షాప్ ల కేటాయింపు జరుగుతుంది. ఇందుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా అబ్కారీ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఆయా జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ డ్రా తీస్తారు. మొత్తం 2,650 లిక్కర్ షాపులకు గాను 786 దుకాణాలు గౌడ్ లు, ఎస్సీలు, ఎస్టీలకు కేటాయించగా.. మిగిలిన 1,834 వైన్స్ లను ఇతరులకు కేటాయిస్తారు. ప్రతి దుకాణానికి లక్కీ డ్రా తీయాల్సి ఉండటంతో పెద్దసంఖ్యలో వచ్చే జనాల ద్వారా ఇబ్బందులు కలగకుండా ఫంక్షన్ హాళ్లలో ఈ ప్రోగ్రాంను నిర్వహిస్తోంది. ఈసారి 1,31,964 టెండర్లు రాగా.. రికార్డులు బ్రేక్ చేస్తూ రూ.2,639 కోట్ల ఆదాయం వచ్చింది.
2021-23లో 68,691 అప్లికేషన్లు రాగా… రూ.1,357 కోట్ల ఇన్ కం దక్కింది. ఇంచుమించు అంతకు 85 శాతం అధికంగా ఈసారి రెవెన్యూ రావడంతో ఎక్సైజ్ శాఖ.. డ్రా కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది.