యూట్యూబ్ ద్వారా వీడియోలను అప్ లోడ్ చేస్తున్న కంటెంట్ క్రియేటర్ల కోసం ఆ సంస్థ కొత్త ఫీచర్ ను తీసుకువచ్చింది. కంటెంట్ క్రియేటర్లు తమ వీడియోకు సంబంధించిన ఆడియోను ఇతర భాషల్లోకి డబ్ చేసుకోవచ్చు. ఇందుకోసం అలౌడ్ (Aloud) అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) టూల్ ని ఉపయోగించాలి. గతేడాది అలౌడ్ (Aloud)ని డెవలప్ చేసిన యూట్యూబ్.. ఇప్పుడు దీన్ని అందరికీ చేరువ చేస్తోంది. ఇప్పటివరకు కంటెంట్ క్రియేటర్లు ఆడియో డబ్బింగ్ కోసం థర్డ్ పార్టీ యాప్ లు వాడేవారు. ప్రస్తుత అలౌడ్ (Aloud)తో ఆ సమస్య తీరుతుందని యూట్యూబ్ ప్రకటించింది. ప్రస్తుతానికి అలౌడ్ (Aloud)తో ఇంగ్లీష్, స్పానిష్, పోర్చుగీస్ భాషలకు అవకాశం ఉండగా, త్వరలోనే హిందీతోపాటు ఇతర ఇండియన్ లాంగ్వేజెస్ లోనూ ఈ ఫీచర్ తెస్తామని తెలిపింది.