ప్రపంచ కుబేరుడు(Billionaire) ఎలాన్ మస్క్ మరో రికార్డు సృష్టించారు. సంపదలో ఇప్పటికే ప్రపంచంలోనే నంబర్ వన్ గా ఉన్న ఆయన.. 400 బిలియన్ డాలర్లను దాటేశారు. దీంతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా, 400 బిలియన్ డాలర్ల రికార్డ్ అందుకున్న ఏకైక వ్యక్తిగా నిలిచారు. ‘బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్’ ప్రకారం.. టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత మస్క్ సంపద 447 బిలియన్ డాలర్లు. స్పేస్ ఎక్స్ వాటా విక్రయంతో 50 బిలియన్ డాలర్లు పెరగ్గా అమెరికా ఎన్నికల తర్వాత ఆయన సంపద భారీస్థాయికి చేరుకుంది. మస్క్ తర్వాత జెఫ్ బెజోస్(249 బిలియన్ డాలర్లు) సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. ఆ తర్వాత మార్క్ జుకర్ బర్గ్(224 బిలియన్ డాలర్లు), లారీ ఎల్లిసన్(198 బిలియన్ డాలర్లు), బెర్నార్డ్ ఆర్నాల్డ్(181 బిలియన్ డాలర్లు) టాప్-5లో ఉన్నారు.