వాహనాల ఫ్యాన్సీ నంబర్ల(Fancy Numbers)కున్న డిమాండ్ అంతాఇంతా కాదు. లక్షలకు లక్షలు పోసి నంబర్లు దక్కించుకునేందుకు పోటీ పడుతుంటారు. హైదరాబాద్ ఖైరతాబాద్ లోని రవాణాశాఖ కార్యాలయంలోనూ ఫ్యాన్సీ నంబర్లు భారీ డిమాండ్ పలికాయి. ఒక్కరోజే రూ.38.76 లక్షల మేర ఆదాయం సమకూరింది. TG09 E 0009 నంబరుకు అత్యధికంగా రూ.10.46 లక్షలు.. TG09 D 9999కు రూ.6.26 లక్షలు.. TG09 E 0001కు రూ.4.69 లక్షలు.. వచ్చాయి. తమకు ఇష్టమైన లక్కీ నంబరు కోసం ఎంత ఖర్చయినా చేస్తుండగా.. న్యూమరాలజీ సెంటిమెంట్ సైతం వీటిని దక్కించుకునేలా చేస్తున్నది.