మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్(MIM) వరల్డ్ ర్యాంకింగ్స్(Rankings)లో.. తొలి 100 స్థానాల్లో 14 భారతీయ విద్యా సంస్థలకు చోటు దక్కింది. ది ఫైనాన్షియల్ టైమ్స్(FT) విడుదల చేసిన 2024 బిజినెస్ ర్యాంకింగ్స్ ల్లో SP జైన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, రీసెర్చ్(SPJMIR) ప్రపంచంలో 35వ స్థానంలో, భారత్ లో తొలి ప్లేస్ లో నిలిచింది.
ఐఐఎం అహ్మదాబాద్(39), ఐఐఎం బెంగళూరు(41), ఐఐఎం లక్నో(55), ఐఐఎం కలకత్తా(56), జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్-XLRI(65), ఐఐఎం కోజికోడ్(68), సింబయాసిస్ సెంటర్ ఫర్ మేనేజ్మెంట్ అండ్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్-SCMHRD(76), ఐఐఎం ఉదయ్ పూర్(81), ఐఐఎం ఇండోర్(83), మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇన్ స్టిట్యూట్ గుర్ గ్రామ్(85), ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ ఇన్ స్టిట్యూట్ న్యూఢిల్లీ (86), NMIMS ముంబయి, స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్(94), ఐఎంటీ ఘజియాబాద్(97) స్థానాల్లో నిలిచాయి.