
PHOTO: THE TIMES OF INDIA
దిల్లీ ఎయిర్ పోర్టులో విమానంలో మంటలు వచ్చాయి. దీంతో హుటాహుటిన భద్రతా సిబ్బంది అప్రమత్తమై మంటలు ఆర్పేశారు. స్పైస్ జెట్ విమానంలో ఈ ఘటన జరిగింది. ఇంజిన్ లో మంటలు వస్తున్నట్లు ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్ గమనించాడు. వెంటనే స్పందించి సమాచారం ఇవ్వడంతో మంటలు ఆర్పగలిగారు. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) స్పందించింది.
స్పైస్ జెట్ Q400 ఎయిర్ క్రాఫ్ట్ కు మరమ్మతుల పనులు పరిశీలిస్తున్నారు. ఇంజిన్ లోపల ఒక చోట నుంచి ఫైర్ వస్తున్నట్లు గమనించిన ఎయిర్ క్రాఫ్ట్ ఇంజినీర్… సెక్యూరిటీ అఫీషియల్స్ కు సమాచారమిచ్చాడు. వెంటనే మంటలు ఆర్పి ప్రమాదం మరింత ఎక్కువ కాకుండా నివారించగలిగామని దిల్లీ ఎయిర్ పోర్ట్ అథారిటీ వివరించింది.