కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ రికార్డు స్థాయిలో ఏడోసారి ప్రవేశపెట్టే బడ్జెట్(Budget)కు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 22 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంటు సమావేశాలు(Sessions) జరగనుండగా.. 2024-25కు గాను ఈనెల 23న బడ్జెట్ ప్రవేశపెడతారు. రెండు సభల సెషన్స్ కు రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
‘శ్లాబు’ల్లో మార్పులు…
పీఠం ఎక్కిన 100 రోజుల్లో చేసే కార్యక్రమాల్ని ప్రధాని చెబితే, ఈసారి NDA బడ్జెట్లో ఆశ్చర్యకర నిర్ణయాలుంటాయని మొన్నటి ప్రసంగంలో రాష్ట్రపతి క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈసారి పన్నుల శ్లాబుల్లో మార్పులుంటాయన్న ఆశలు కనిపిస్తున్నాయి. ఎన్నికల వల్ల ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర(Interim) బడ్జెట్లో ఎలాంటి ఆశాజనక నిర్ణయాలు రాలేదు.
ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మల.. దేశ చరిత్రలోనే కొత్త రికార్డు సృష్టించబోతున్నారు. ఇపటివరకు గల మొరార్జీ దేశాయ్ రికార్డును ఆమె అధిగమిస్తారు.