నిన్న భారీ స్థాయిలో నష్టాలు మూటగట్టుకున్న స్టాక్ మార్కెట్లు.. ఈరోజు లాభాల(Profits) దిశగా సాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎదురైన ఒడిదొడుకులతో అతలాకుతలమైన మార్కెట్లు.. ఇవాళ ప్రారంభం నుంచే లాభాల ట్రేడింగ్ లో నడుస్తున్నాయి. BSE సెన్సెక్స్ 920 పాయింట్ల లాభంతో 79,679.64 వద్ద.. NSE నిఫ్టీ 274 పాయింట్ల లాభంతో 24,329.80 వద్ద ట్రేడవుతున్నది.
అమెరికా ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లో నిన్న 3% శాతం మేర కోల్పోయిన భారత మార్కెట్లు మంగళవారం రికవరీ దిశగా సాగుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపరులు నిన్న 10,073 కోట్ల షేర్లు అమ్మగా.. భారత ఇన్వెస్టర్లు 9,155 కోట్ల షేర్లు అమ్మకానికి పెట్టారు. PFC, వేదాంత, టాటా పవర్, TVS మోటార్స్, శ్రీ సిమెంట్స్ తోపాటు 132 కంపెనీలు తమ తొలి త్రైమాసిక(First Quarter) ఫలితాలు ప్రకటించబోతున్నాయి.