మోదీ UK పర్యటనతో భారత్-ఇంగ్లండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్యం(Free Trade) మరింత పెరిగి వస్తువుల ధరలు బాగా తగ్గనున్నాయి. సాఫ్ట్ డ్రింక్స్, కాస్మొటిక్స్, చాక్లెట్స్, బిస్కట్స్, మటన్-ఫిష్ ఉత్పత్తులు, కార్లు, మెడికల్, ఏరోస్పేస్ పార్ట్స్ వంటి బ్రిటన్ ప్రొడక్ట్స్ చౌక అవుతాయి. సుంకాలు 15% నుంచి 3 శాతానికి దిగివస్తాయి. ఎలక్ట్రిక్ వెహికిల్స్(EV) అయితే 110% నుంచి 10 శాతానికి తగ్గుతాయి. విస్కీ ధరలు 150% నుంచి ప్రస్తుతానికి 75 శాతానికి చేరుకుని, పదేళ్ల తర్వాత అవి 40 శాతానికి దిగిరానున్నాయి. ఆ దేశంలో ఎలాంటి ఆఫీసు లేకున్నా భారతీయులు రెండేళ్ల పాటు 35 రంగాల్లో పనిచేసేందుకు వెసులుబాటు ఉంటుంది. TCS, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, HCL, విప్రో వంటి కంపెనీల్లో ఏటా 60 వేల మందికి లాభం జరుగుతుంది. మరిన్ని వార్తలకు క్లిక్ చేయండి…: https://justpostnews.com