బంగారం(Gold), వెండి(Silver) ధరలు(Rates) సోమవారం దేశంలో స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల బంగారం ధర ఈరోజు రూ.61,120గా ఉంది. ఇది శనివారం నాడు రూ.61,330గా ఉంది. దీంతో ఇవాళ రూ.210 తగ్గినట్లయింది. బులియన్ మార్కెట్ లో వెండి ధరలు కూడా కొంచెం తగ్గాయి. కిలోకు రూ.220 తగ్గి రూ.76,250 రేట్ కి చేరుకుంది. శనివారం నాడు వెండి ధరలు కిలోకు రూ. 76,470గా ఉన్నాయి.
బంగారం వ్యాపారానికి ప్రధాన కేంద్రాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరులోనూ 10 గ్రాముల బంగారం ధర రూ.61,120గా.. వెండి రేట్ కిలోకు రూ.76,250గా ఉంది.