కమాండో తరహా ఆపరేషన్ నిర్వహించిన కేరళ GST డిపార్ట్మెంట్.. 108 కిలోల బంగారాన్ని జప్తు(Seize) చేసింది. ఇంటెలిజెన్స్ సమాచారంతో 78 జువెల్లరీ దుకాణాలపై దాడులకు దిగి అక్రమంగా నిల్వ ఉంచిన స్వర్ణాన్ని స్వాధీనం చేసుకుంది. టోరె డెల్ ఓరో(Torre Del Oro – టవర్ ఆఫ్ గోల్డ్) పేరు గల ఆపరేషన్ తో త్రిశూర్‌లో 700 మంది అధికారులు సోదాలు చేపట్టారు.
గత ఐదేళ్లుగా రూ.1,200 కోట్ల అక్రమ వ్యాపారం జరుగుతున్నదని గుర్తించిన యంత్రాంగం ఏకకాలంలో దాడులకు దిగినట్లు GST స్పెషల్ కమిషనర్ రెన్ అబ్రహం తెలిపారు. ఒక్కో వ్యాపారి(Firm) రూ.10 కోట్ల దాకా బిజినెస్ చేస్తున్నా పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారని తేలింది. వీరికి 3% శాతం పెనాల్టీ, మరో 3% GST ఫైన్ వేయగా.. ఇప్పటికే రూ.5.5 కోట్లు రికవరీ చేశారు.