బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. రోజూ ఆల్ టైమ్ రికార్డును తిరగరాస్తూనే ఉంది. హైదరాబాద్ బులియన్(Bullion) మార్కెట్లో 24 క్యారెట్ల పుత్తడి(Gold) రూ.1,07,620… 22 క్యారెట్ల ధర రూ.98,650గా ఉంది. 24 క్యారెట్లకు నిన్న(ఈనెల 4న) రూ.110 తగ్గి ఈరోజు రూ.760 పెరిగింది. 22 క్యారెట్లకు సైతం నిన్న రూ.100 తగ్గి ఇవాళ రూ.700 పెరిగింది. కిలో వెండి నిన్నటి పోల్చితే రూ.1000 తగ్గి రూ.1,36,000 పలుకుతోంది.