బంగారం, వెండి ధరలు దేశవ్యాప్తంగా ఒక్కరోజులోనే భారీగా తగ్గాయి. ముఖ్యంగా వెండి రూ.1,000కి పైగా తగ్గింది. అటు బంగారం ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల బంగారం ధర ఈరోజు రూ.60,930గా పలుకుతుండగా ఇది సోమవారం నాడు 61,400గా ఉంది. ఈ లెక్కన నిన్నటికన్నా ఈ రోజు రూ.470 తగ్గింది. అటు వెండి కిలో ఇవాళ రూ.74,885గా ఉండగా.. నిన్న సోమవారం రూ.75,915గా అమ్ముడైంది. ఒక్క రోజులోనే కిలో వెండి రూ.1,030 తగ్గినట్లయింది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు మార్కెట్లలోనూ బంగారం, వెండి ధరలు ఇదే రీతిన కొనసాగుతున్నాయి.