పలు రకాల లోహాల(Metals)పై కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో బంగారం, వెండి ధరలు అమాంతం దిగివచ్చాయి. ఇవాళ్టి బడ్జెట్లో బంగారం, వెండిపై 6 శాతం పన్ను తగ్గించడంతో ధరల్లో ఒక్కరోజులోనే పెద్దయెత్తున మార్పు కనపడింది.
ఎంతలా అంటే…
బడ్జెట్ కు ముందు వరకు 10 గ్రాముల పుత్తడి(Gold) ధర బులియన్ మార్కెట్లో రూ.75,500 ఉంటే.. బడ్జెట్ తర్వాత రూ.71,000కి చేరుకుంది. ఇలా కొన్ని గంటల వ్యవధిలోనే రూ.4,500 వరకు తగ్గుదల నమోదైంది.
ఇక వెండి ఇవాళ పొద్దున రూ.91,500 పలికితే.. నిర్మలా సీతారామన్ ప్రసంగం తర్వాత రూ.87,500కు చేరుకుంది. ఇలా వెండి(Silver) ధరలు ఏకంగా రూ.4,000 తగ్గినట్లయింది. కేంద్రం తగ్గించిన 25 లోహాల్లో బంగారం, వెండి, ప్లాటినం ఉన్నాయి.