ఎన్నికల కోడ్ అమలులో భాగంగా పెద్దయెత్తున తనిఖీలు చేస్తున్న పోలీసులకు భారీగా సొత్తు స్వాధీమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ల వద్ద బంగారం, వెండి, నగదును తరలిస్తున్న వాహనాలను గుర్తించి సీజ్ చేశారు. గురువారం నాడు 53.5 కిలోల బంగారం(Gold), 190 కిలోల వెండి(Silver)తోపాటు నగదు(Cash)ను పట్టుకున్నారు. హైదరాబాద్-విజయవాడ 65వ నంబరు జాతీయ రహదారి(High Way)పై చిట్యాల వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తే భారీగా బంగారం, వెండిని తరలిస్తున్న వాహనాలు కంటపడ్డాయి. రెండు కార్లలో 40 కేజీల బంగారం, 190 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. జువెల్లరీ షాపులకు సంబంధించినవిగా చెప్పగా.. సదరు వెహికిల్స్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిజానిజాల్ని గుర్తించేందుకు గాను పోలీసులు విచారణ చేస్తున్నారు.
హైదరాబాద్ లోనూ భారీస్థాయిలో
హైదరాబాద్ సైఫాబాద్ లో జరిపిన వెహికిల్ చెకింగ్స్ లో 13.5 కేజీల పసిడిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ చౌరస్తా నిర్వహించిన తనిఖీల్లో రూ.27.35 లక్షలు, నారాయణగూడలో మరో రూ.11.50 లక్షలు పోలీసులకు పట్టుబడ్డాయి.