Published 22 Nov 2023
గూగుల్ పే… భారత్ లోని UPI పేమెంట్స్ లో అత్యంత పాపులారిటీ సంపాదించుకున్న యాప్ ఇది. భారత్ లో టాప్-5 పొజిషన్ లో ఉన్న ఈ సంస్థ.. తన కస్టమర్లకు వార్నింగ్ ఇచ్చింది. గూగుల్ యాప్ వినియోగిస్తున్న కస్టమర్లు మోసాల బారిన పడకుండా అధునాతన వ్యవస్థను ఏర్పాటు చేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నది. అయితే గూగుల్ పే వాడుతున్న సమయంలో మొబైల్స్, ల్యాప్ టాప్స్, టాబ్లెట్స్ ల్లో ఎలాంటి యాప్ లు ఓపెన్ చేసుకోవద్దని హెచ్చరించింది. ‘గూగుల్ పే వినియోగిస్తున్న సమయంలో అన్ని స్క్రీన్లను ఆపివేయాలి.. ఎలాంటి స్క్రీన్ షేరింగ్ జరిగినా చాలా ప్రమాదకరం.. స్క్రీన్ షేరింగ్ కు అనుమతిస్తే మీ వివరాల్ని వాళ్ల చేతుల్లో పెట్టినట్లే’ అంటూ ప్రకటనలో గూగుల్ తెలియజేసింది.
‘మీకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా లావాదేవీలు జరిపేందుకు ఫుల్ సెక్యూరిటీ ఇస్తున్నాం.. కానీ స్క్రీన్ షేరింగ్ ఇవ్వడం ద్వారా మీ ట్రాన్జాక్షన్స్ కు సంబంధించిన రిమోట్ వారి చేతుల్లో ఉన్నట్లే’నని గూగుల్ క్లారిటీ ఇచ్చింది. థర్డ్ పార్టీ యాప్ లను గూగుల్ ఎప్పుడూ అడగబోదని, అలాంటి యాప్ లు ఉంటే వెంటనే క్లోజ్ చేయాలని, లేదంటే పర్మినెంట్ గా డిలిట్ చేయాలని సూచించింది.
ఇతర యాప్ ల వల్ల నష్టాలు
- క్రెడిట్, డెబిట్ కార్డుల డీటెయిల్స్ తెలిసే ప్రమాదం
- ATM కార్డుల వివరాలు, పిన్ నంబర్లపై ఎఫెక్ట్
- నగదు లావాదేవీల OTPలు తస్కరించే అవకాశం