రైతుల విషయంలో బ్యాంకర్లు పెట్టే అవస్థలు మామూలుగా ఉండవు. సర్కారు ఎన్నిసార్లు చెప్పినా తామేం చేయాలో అదే చేస్తారు బ్యాంకు అధికారులు. అందుకే ఈ విషయంపై మరోసారి క్లారిటీ ఇచ్చారు డిప్యూటీ CM భట్టి విక్రమార్క. రైతు రుణమాఫీ(Loan Waiver)కి ఇతర అప్పులతో ఎట్టి పరిస్థితుల్లోనూ ముడిపెట్టకూడదని స్పష్టం చేశారు.
ప్రభుత్వం ఇచ్చే నిధుల్ని రుణమాఫీ కోసమే వాడాలని, ఇతర అప్పులంటూ రైతుల్ని ఇబ్బంది పెట్టొద్దని బ్యాంకర్ల సమావేశంలో భట్టి తెలియజేశారు. రూ.2 లక్షలకు పైగా రుణం ఉన్న రైతులతో ప్రత్యేకంగా మాట్లాడాలన్నారు. మిగిలిన మొత్తాన్ని రికవరీ చేసుకుని, రూ.2 లక్షల మాఫీతో ఏ రైతూ బకాయి లేకుండా చూడాలన్నదే తమ సర్కారు లక్ష్యమన్నారు.