అందరికీ జీవితబీమా(Life Insurances)లు అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతో వాటిపై GSTని కేంద్రం తొలగించింది. వ్యక్తిగత, జీవిత బీమా పాలసీల ద్వారా 2024 ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి రూ.16,398 కోట్లు వచ్చింది. జీవితబీమాలపై రూ.8,135 కోట్లు, ఆరోగ్య(Health) బీమాలపై రూ.8,263 కోట్లు సమకూరింది. ఇప్పుడీ పూరి మినహాయింపుతో ప్రీమియంలు 15 శాతం తగ్గుతాయని నిపుణులు అంచనా వేశారు.