
హ్యామ్ రోడ్లు అనే పదం ఈమధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్(HAM) ప్రకారం నిర్మించే రోడ్లను హ్యామ్ రోడ్లు అంటారు. ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్ కన్ స్ట్రక్షన్(EPC)తో బిల్ట్, ఆపరేట్, ట్రాన్స్ఫర్(BOT) పద్ధతిలో నిర్మిస్తారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం(PPP)తో నిర్మాణానికి అయ్యే ఖర్చులో 40% కేంద్రం, మరో 60 శాతాన్ని ప్రైవేట్ కాంట్రాక్టర్లు వెచ్చిస్తారు. ప్రతి సంవత్సరం వారికి కొంత మొత్తాన్ని సర్కారు చెల్లిస్తుంది.