అందరికీ అనువుగా ఉండేలా కొత్త బీమా(Insurance) అందుబాటులోకి వచ్చింది. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్(IPPB)తో పలు కార్పొరేట్ సంస్థలు జాయింట్ గా ‘గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్’ ప్లాన్లను ప్రవేశపెట్టాయి. 18 నుంచి 65 సంవత్సరాల వయసున్న వ్యక్తులు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రెండు ప్లాన్లు ఎలా ఉంటాయో చూద్దాం…
రూ.399 ప్లాన్…
ఏడాదికి రూ.399 చెల్లిస్తే ప్రమాదవశాత్తూ(Accidental) మరణించినా, వైకల్యం ఏర్పడినా రూ.10 లక్షల బీమా పొందవచ్చు. పాలసీ తీసుకున్న వ్యక్తి ప్రమాదం బారిన పడి హాస్పిటల్లో చేరితే మెడిసిన్ ఖర్చుల కోసం రూ.60,000 లేదా ట్రీట్మెంట్ ఖర్చుల కోసం రూ.30,000 అందిస్తారు. దీంతోపాటు హాస్పిటల్లో 10 రోజుల పాటు ఉంటే రోజుకు రూ.1,000 చొప్పున చెల్లించనుండగా.. వ్యక్తి కుటుంబ ప్రయోజనం కింద రవాణా ఖర్చులకు రూ.25,000 అందుతుంది. ఒకవేళ పాలసీదారు మరణిస్తే అంత్యక్రియల కోసం రూ.5,000 దక్కనుండగా, ఈ ప్లాన్ కింద విద్యకు సంబంధించిన ప్రయోజనాలు అందుతాయి.
రూ.299 ప్లాన్…
ఈ ప్లాన్ కింద సైతం రూ.399 మాదిరిగానే రూ.10 లక్షల బీమా పొందవచ్చు. కానీ ఎడ్యుకేషన్ బెనిఫిట్స్, హాస్పిటల్లో 10 రోజులు ఉంటే రోజుకు వెయ్యి చొప్పున లభించే ప్రయోజనాలు అందవు.