క్యాంపస్ ఇంటర్వ్యూల్లో అత్యధిక విదేశీ వార్షిక వేతనం పొందుతున్న విద్యా సంస్థల్లో ఐఐటీ బాంబే చరిత్ర సృష్టిస్తున్నది. తాజాగా ఆ సంస్థకు చెందిన విద్యార్థికి రూ.3.7 కోట్ల యాన్యువల్ ఇన్ కమ్ తో కూడిన విదేశీ కంపెనీ ఉద్యోగం దక్కింది. ఇక దేశీయంగా చూస్తే రూ.1.7 కోట్ల అత్యధిక వేతనాన్ని మరో విద్యార్థి దక్కించుకున్నాడు. ఇది గతేడాది రూ.2.1 కోట్లు ఉండగా… ఈసారి అది రూ.3.7 కోట్లకు ఎగబాకింది. మన దేశంలోని కంపెనీల ఆఫర్ల పరంగా చూస్తే గతేడాది IIT బాంబే నుంచి రూ.1.8 కోట్ల అత్యధిక వార్షిక వేతనాన్ని పొందిన రికార్డు ఇప్పటికీ అలాగే ఉంది. ఇంజినీరింగ్, టెక్నాలజీ రంగంలో టాలెంట్ గల స్టూడెంట్స్ ని సాఫ్ట్ వేర్ కంపెనీలు తీసుకుపోతున్నాయి. ఈ సారి ప్రఖ్యాత IIT బాంబే నుంచి రూ.1 కోటికి పైగా యాన్యువల్ ఇన్ కం(Annual Income) ఆఫర్లు 16 మందికి దక్కాయి. ఈ క్యాంపస్ ఇంటర్వ్యూల్లో మొత్తం 300 మందికి ప్రీ ప్లేస్ మెంట్స్ ఆఫర్ అందితే అందులో 65 ఇంటర్నేషనల్ ఆఫర్స్ కలిపి 194 మంది మాత్రమే ఉద్యోగాలను యాక్సెప్ట్(Accept) చేశారు.
IIT బాంబే నుంచి 65 మంది అంతర్జాతీయ కంపెనీల ఆఫర్లు అందుకుంటే అందులో US, జపాన్, UK, నెదర్లాండ్స్, హాంకాంగ్, తైవాన్ కు చెందినవే ఎక్కువగా ఉన్నట్లు క్యాంపస్ వర్గాలు ప్రకటించాయి. గత డిసెంబరులో ఫస్ట్ ఫేజ్.. జనవరి-జులై మధ్య సెకండ్ ఫేజ్ లో క్యాంపస్ ఇంటర్వ్యూలు జరిగాయి. ప్రైమరీ స్టేజ్ లో నిర్వహించిన ఓవరాల్ ఇంటర్వ్యూల్లో ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీకి సంబంధించి 97 కంపెనీలు 458 మందిని సెలెక్ట్ చేశాయి. మరో 88 మంది కంపెనీలు ఇంకో 302 మందిని ఐటీ, సాఫ్ట్ వేర్ లో సెలెక్ట్ చేసుకున్నాయి. పూర్తిస్థాయి రిక్రూట్ మెంట్ ను పరిగణలోకి తీసుకుంటే బీటెక్, ఎంటెక్ రెండూ కంప్లీట్ అయిన స్టూడెంట్సే 90 శాతం ఉద్యోగాలు దక్కించుకున్నారు. 2022-23కు గాను 1,845 మంది ఇంటర్య్యూలకు అటెండ్ అయితే అందులో 82% శాతం మంది ఉద్యోగాలు పొందారు. PhD స్టూడెంట్స్ మాత్రం కేవలం 31% ఉద్యోగాలకే ఎంపికయ్యారు.