జీవితాన్నిచ్చిన విద్యాలయానికి భూరి విరాళం అందించారు నందన్ నీలేకని. ఇన్ఫోసిస్ ఛైర్మన్, ఆధార్ ఫౌండర్ అయిన నీలేకని… బాంబే ఐఐటీకి రూ.315 కోట్ల విరాళం ప్రకటించారు. ప్రపంచ స్థాయి సదుపాయాలతోపాటు ఇంజినీరింగ్, టెక్నాలజీలో రీసెర్చ్ కోసం ఈ నిధులు ఉపయోగిస్తారు. 1973లో ఇదే సంస్థ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ నుంచి డిగ్రీ కంప్లీట్ చేసుకున్న నీలేకని… 1999 నుంచి ఐఐటీ బాంబే హెరిటేజ్ ఫౌండేషన్ బోర్డులో, 2005-2011 మధ్య గవర్నర్ల బోర్డులో ఉన్నారు.
దేశంలోనే రికార్డు
దేశంలో ఒక ఓల్డ్ స్టూడెంట్ అందించిన అత్యధిక విరాళం ఇదే కావడం విశేషం. గతంలోనూ బాంబే ఐఐటీకి నీలేకని రూ.85 కోట్లు అందించారు. జీవితానికి పునాది వేసిన సంస్థతో 50 ఏళ్ల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఈ విరాళం అందజేస్తున్నట్లు తెలిపారు.