ఆదాయ మార్గాల్ని పెంచుకునే పనిలో పడ్డ TGSRTC… కార్గో సేవల్లో సరికొత్త విధానాని(System)కి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు RTC సెంటర్ల వరకే రవాణా ఉండగా ఇక నుంచి డోర్ డెలివరీ చేపట్టింది. పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ లో ఈ హోం డెలివరీ సౌకర్యాన్ని ఆదివారం(ఈనెల 27) నుంచి అందుబాటులో తీసుకువస్తున్నది. TGSRTC లాజిస్టిక్ సెంటర్ల నుంచి రాష్ట్ర రాజధానిలో ఎక్కడికైనా హోం డెలివరీ చేయవచ్చని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రానున్న రోజుల్లో ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తం చేయబోతున్నారు.
హోం డెలివరీ ఛార్జీలు ఇలా…
* 0 నుంచి 1 కేజీ పార్సిల్ కు రూ.50
* 1.01 నుంచి 5 కేజీలకు రూ.60
* 5.01 నుంచి 10 కేజీలకు రూ.65
* 10.01 నుంచి 20 కేజీలకు రూ.70
* 20.01 నుంచి 30 కేజీలకు రూ.75
* 30.01 కేజీలు దాటితే… పైన తెలిపిన శ్లాబ్ ల లెక్కన ధరలు ఉంటాయని సంస్థ తెలిపింది.