
పసుపు లోహాన్ని ఆధ్యాత్మిక అవసరం, రక్షణ కవచంగా భావించే నాగరికత మనది. అలాంటి భారత్ లో 50 కోట్ల టన్నుల బంగారు ఖనిజ నిల్వలున్నాయి. కానీ ఏటా ఒకటిన్నర నుంచి 2 టన్నులే తవ్వుతున్నాం. ఆస్ట్రేలియా, ఘనా, పెరూలోనైతే ఏటా వందల టన్నులు తీస్తారు. ఉన్న పసిడిని వెలికితీయక, ఏటా వెయ్యి టన్నుల్ని దిగుమతి చేస్తూ విదేశీ మారక నిల్వల్ని హరించేస్తున్నాం. ఇలా చేయడం వల్లే రూపాయి విలువ భారీగా పతనమవుతూనే ఉంది. కర్ణాటక, మధ్యప్రదేశ్, ఏపీ, జార్ఖండ్ లో భారీగా నిల్వలున్నాయి.
దశాబ్దాల క్రితం న్యూయార్క్ లో దాచిన 129 టన్నుల బంగారాన్ని అమ్మి రూ.12 లక్షల కోట్లను సంపాదించింది. యుద్ధాల కోసమూ రష్యా, ఇరాన్ బంగారాన్ని అమ్ముకున్నాయి. మనదేశంలో మైనింగ్ ను సులభతరం చేస్తేనే తవ్వకాలు పెద్దయెత్తున పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు. రాయల్టీలు, పన్నుల్ని అందుబాటులో ఉంచేలా చేస్తే భారతదేశానికి తిరుగుండదు.