అమెరికాలో శాశ్వత(Permanent) నివాసం కోసం డొనాల్డ్ ట్రంప్ తెచ్చిన స్కీంకు మంచి స్పందన ఉంటోంది. 5 మిలియన్ డాలర్లు(రూ.42.5 కోట్లు) చెల్లించే ఎవరైనా USలో ఉండిపోవచ్చు. గోల్డ్ కార్డు పేరిట గోల్డెన్ వీసాను రెండు వారాల క్రితమే అమల్లోకి తెచ్చారు. ఒక్క రోజే 1,000 కార్డులు అమ్ముడవగా, చాలామంది లైన్లో ఉన్నారని US వాణిజ్య కార్యదర్శి హొవార్డ్ లుత్నిక్ తెలిపారు. ఈ స్కీమ్ కోసం ఎలాన్ మస్క్ సరికొత్త సాఫ్ట్ వేర్ తయారు చేయిస్తున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా 3.7 కోట్ల మంది గోల్డ్ కార్డు అర్హులున్నారని, ట్రంప్ లక్ష్యం మిలియన్ కార్డులు అమ్మడమేనన్నారు. ఈ నిధులు అమెరికా ఆర్థిక లోటును పూడ్చుతాయని ఆశిస్తున్నారు.