బులియన్ మార్కెట్లో రోజురోజుకూ పెరిగిపోతున్న పుత్తడి రేట్లు(Gold Rates) సామాన్యులకు అందకుండా పోతున్నాయి. బంగారం కొనడం అటుంచి ఆ మాట వినాలన్నా భయంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో.. ఒక్కరోజులోనే భారీగా ధరలు దిగివచ్చాయి. కేంద్ర మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ తో మళ్లీ బంగారం ధగధగా మెరిసిపోయే స్థాయికి చేరుకుంది.
బంగారం, వెండి, ప్లాటినం వంటి 25 లోహాలపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడంతో వాటి ధరలు గణనీయంగా తగ్గిపోయాయి. మొత్తంగా సుంకాన్ని 10% నుంచి 4% శాతానికి తగ్గించడంతో.. కిలో బంగారం రూ.77 లక్షల పైగా ఉన్న ధర నుంచి రూ.71 లక్షలకు చేరుకుంది.
నిన్న బడ్జెట్ కు ముందు వరకు 10 గ్రాముల పుత్తడి ధర రూ.75,500 ఉంటే.. తర్వాత రూ.71,000కి చేరుకుంది. ఇక వెండి అంతకుముందు రూ.91,500 పలికితే.. నిర్మల ప్రసంగం తర్వాత రూ.87,500కు చేరుకుంది. ఇలా బంగారం రూ.4,500, వెండి(Silver) ఏకంగా రూ.4,000 తగ్గినట్లయింది.