బ్రిటన్ లో భారీ పెట్టుబడులు(investments) పెట్టేందుకు దేశీయ దిగ్గజం టాటా గ్రూపు సిద్ధమవుతోంది. 4 బిలియన్ పౌండ్లతో ఎలక్ట్రిక్ వెహికిల్ బ్యాటరీ ప్లాంటుకు ముందుకొచ్చింది. టాటా గ్రూపు పెట్టుబడుల విషయాన్ని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. టాటా గ్రూప్ నకు మన దేశంలో టాటా మోటార్స్ తోపాటు UKలో జాగ్వార్ లాండ్ రోవర్ ఉండగా దీని ద్వారా లగ్జరీ కార్లు ప్రొడక్ట్ చేస్తున్నారు. సోమర్ సెట్ లో ఎలక్ట్రిక్ వెహికిల్ బ్యాటరీ ప్లాంటు నిర్మించాలని చూస్తుండగా.. 2026 నుంచి ఉత్పత్తి ప్రారంభించాలని భావిస్తున్నారు. ఈ ప్లాంటు ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అంటున్నారు.
ఈ పెట్టుబడి ద్వారా ఆటోమొబైల్ రంగం ఎలక్ట్రిక్ వాహనాల వైపు దృష్టి మరల్చేలా చేస్తుందని టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ అన్నారు.