ఆదాయపన్ను చట్టం-1961 స్థానంలో తెచ్చిన కొత్త బిల్లును కేంద్రం ఉపసంహరించుకోనుందని జాతీయ మీడియా అంటోంది. ఈ కొత్త బిల్లును సర్కారు 2025 ఫిబ్రవరి 13న లోక్ సభలో ప్రవేశపెట్టింది. అయితే దీన్ని అప్డేట్ చేసి మళ్లీ పార్లమెంటు ముందుకు తెచ్చే ఆలోచనలో ఉంది. BJP ఎంపీ బైజయంత్ జే పాండా నేతృత్వంలోని సెలెక్ట్ కమిటీ సిఫార్సులతో ఈ కొత్త వెర్షన్ ను సోమవారం తేనున్నట్లు వార్తలు వచ్చాయి. 5 లక్షల పదాలు, 4 వేలకు మించి సవరణలకు గురైందీ 1961-చట్టం. అందుకే చిన్న వ్యాపారులు, MSMEలకు వీలుగా కొత్త బిల్లు ఉండనుంది. కొత్త పన్ను శ్లాబుల్లో రూ.12 లక్షల వరకు ఉపశమనం ఉంది. దానికి ఏ కొంచెం ఎక్కువున్నా టాక్స్ చెల్లించాల్సిందే. కానీ ఈ అప్డేటెడ్ వెర్షన్ అమల్లోకి వస్తే రూ.12 లక్షలు దాటినా పన్ను భారం తప్పే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వార్తలకు క్లిక్ చేయండి…: https://justpostnews.com