NDA సర్కారు అధికారంలోకి వచ్చాక వ్యక్తిగత పన్ను చెల్లింపులపై తొలిసారి సంచలన నిర్ణయం వెలువడింది. కొత్త బడ్జెట్లో పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగిస్తూ కేంద్రం తీపికబురు అందించింది. కొత్త ఆదాయపన్ను విధానంలో శ్లాబులు మార్చారు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. పాత – కొత్త పన్ను(అంచనా) విధానాల్ని పరిశీలిస్తే…
పాత పన్ను విధానం(ఆదాయం) | మినహాయింపు | కొత్త పన్ను విధానం(ఆదాయం) | మినహాయింపు |
రూ.3,00,000 వరకు | 0% | రూ.0-4,00,000 | 0% |
రూ.3,00,000 నుంచి రూ.7,00,000 వరకు | 5% | రూ.4,00,000 – రూ.8,00,000 | 5% |
రూ.7,00,000 నుంచి రూ.10,00,000 వరకు | 10% | రూ.8,00,000 – రూ.12,00,000 | 10% |
రూ.10,00,000 నుంచి రూ.12,00,000 వరకు | 15% | రూ.12,00,000 – రూ.16,00,000 | 15% |
రూ.12,00,000 నుంచి రూ.15,00,000 వరకు | 20% | రూ.16,00,000 – రూ.20,00,000 | 20% |
15,00,000 లక్షలకు రూపాయలకుపైగా | 30% | రూ.20,00,000 – రూ.24,00,000 | 25% |
రూ.24,00,000 పైన | 30% |