
ITR(ఇన్ కం టాక్స్ రిటర్న్స్) దాఖలు గడువును ఒకరోజు పొడిగించినా ప్రయోజనం లేకుండా పోయింది. సెప్టెంబరు 15కు బదులు 16వ తేదీ వరకు పొడిగించినా సమస్యలు అలాగే ఉన్నాయి. ఎంత ప్రయత్నించినా ఈ-ఫైలింగ్ పోర్టల్ లాగిన్ కావట్లేదని వ్యాపారులు, ఉద్యోగులు, CAలు వాపోతున్నారు. ITR ఫైలింగ్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ ఒక్కరోజుకు బదులు వారం పెంచినా ప్రయోజనం ఉండేదంటున్నారు. సైట్ లాగిన్ కాక ఒక్కరోజు వెసులుబాటు వృథా అయిందంటున్నారు. 2025-26 మదింపు సంవత్సరానికి గాను జులై 31 నుంచి సెప్టెంబరు 15 వరకు గడువుండగా.. 7.3 కోట్లకు పైగా ఫైలింగ్ లు జరిగినట్లు ఆ శాఖ తెలిపింది.