బీమా దిగ్గజ సంస్థ LIC(లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. దేశీయంగా గల కార్పొరేట్ బ్రాండ్లలో అత్యంత విలువైన(Most Valuable) నాలుగో సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. 10.068 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో ఈ స్థానం దక్కించుకుందని బ్రాండ్ ఫైనాన్స్ ఇండియా విడుదల చేసిన నివేదిక ద్వారా వెల్లడైంది.
AAA బ్రాండ్ రేటింగ్ తో LIC 88 స్కోర్ సాధించగా.. టాప్-10 దేశీయ బ్రాండ్ల(Brands)లో నాలుగో స్థానంలో నిలిచింది భారతీయ జీవిత బీమా సంస్థ. IT, ఆటోమోటివ్, రిటెయిల్, ఆతిథ్య రంగాల్లో 250 సంస్థల్ని పరిగణలోకి తీసుకుని బ్రాండ్ల విలువను కేటాయించింది. ‘సాల్ట్ టూ సాఫ్ట్ వేర్’గా సేవలందిస్తున్న టాటా గ్రూప్ ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది.
టాప్-5 బ్రాండ్ కంపెనీలివే…
ర్యాంక్ | సంస్థ పేరు | బ్రాండ్ విలువ |
1 | టాటా గ్రూప్ | 28.634 మిలియన్ డాలర్లు |
2 | ఇన్ఫోసిస్ | 14.213 మిలియన్ డాలర్లు |
3 | HDFC బ్యాంక్ | 10.374 మిలియన్ డాలర్లు |
4 | భారతీయ జీవిత బీమా సంస్థ(LIC) | 10.068 మిలియన్ డాలర్లు |
5 | రిలయన్స్ గ్రూప్ | 8.375 మిలియన్ డాలర్లు |