ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో GDP వృద్ధిరేటు భారీగా నమోదైంది. అమెరికా సుంకాలు భారత్ కు ఆర్థికంగా మేలే చేశాయి. ఏప్రిల్-జూన్ త్రైమాసికం(Quarter)లో 6.5% అంచనా అయితే.. 7.8 శాతంగా నమోదైంది. గతేడాది తొలి క్వార్టర్లో 6.5%గా ఉంది. GDP(గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్) వృద్ధికి వ్యవసాయ రంగమే ప్రధాన కారణమని NCO(నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్) తెలిపింది. ఈ ఏడాది 6.5%గా ఉంటుందని RBI అంచనా వేసింది. 2047 నాటికి అధిక ఆదాయ వ్యవస్థగా మారాలంటే సగటున 7.8% వార్షిక వృద్ధిరేటు అవసరమని ప్రపంచ బ్యాంకు అభిప్రాయపడింది. 2000-2024 మధ్య మనదేశం సగటున 6.3% వృద్ధి సాధించింది. ఒక దేశ స్థూల దేశీయోత్పత్తి(GDP)లో వేగంగా పెరుగుదల ఉంటే దాన్ని ‘ఆర్థిక వృద్ధిరేటు’ అంటారు.