ప్రపంచ రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్(India) అవతరించనుందని, అమెరికా(America)ను దాటి 2038లో చరిత్ర సృష్టిస్తుందని EY ఎకానమిక్ వాచ్ నివేదిక తెలిపింది. కొనుగోలు శక్తి సమానత్వం(పర్చేజింగ్ పవర్ ప్యారిటీ) పరంగా 2030కి 20.7 ట్రిలియన్ డా.కు, 2038 నాటికి 34.2 ట్రిలియన్ డాలర్లకు చేరుతుంది. అధిక పొదుపులు, పెట్టుబడి రేట్లు, అనుకూల జనాభా, స్థిరమైన ఆర్థిక స్థితితో అత్యంత డైనమిక్ గా భారత్ అభివృద్ధి చెందుతుందని తెలిపింది.
సుంకాల ఒత్తిళ్లు, వాణిజ్యం వంటి ప్రపంచ అనిశ్చితులు ఉన్నా దేశీయ డిమాండ్ పై ఆధారపడటం, మోడ్రన్ టెక్నాలజీ సామర్థ్యం వల్ల దూసుకుపోతుందని తెలిపింది. 2028-2030ల్లో IMF అంచనాల ప్రకారం భారత్, అమెరికా వరుసగా 6.5%, 2.1% సగటు వృద్ధిరేటు కొనసాగిస్తే 2038 నాటికి భారత్ దే రెండో స్థానమని వివరించింది. 2025 మేలో జపాన్ ను దాటి నాలుగో స్థానంలో నిలిచిన భారత్.. 2028లో జర్మనీని అధిగమిస్తుంది.