కరోనా దెబ్బకు విలవిల్లాడిన పర్యాటక(Tourism) రంగం.. ఈ ఏడాది బాగా కోలుకుంది. గత నాలుగేళ్లుగా పోలిస్తే ఈ ఏడాది ప్రపంచంలోని పలు దేశాల్ని సందర్శించేందుకు క్యూ కట్టారు. 2024కు గాను గూగుల్ లో కొన్ని పర్యాటక ప్రాంతాలు ట్రెండింగ్ గా నిలిచాయి. అజర్ బైజాన్ దేశాన్ని వెతికేందుకు మనవాళ్లు బాగా సెర్చ్ చేయడంతో భారతీయులకు ఇష్టమైన ట్రావెల్ డెస్టినేషన్ గా నిలిచింది. ఆ దేశానికి విమాన టికెట్లు అందుబాటు ధరల్లో ఉండగా, వీసాను సైతం మూడు రోజుల్లోనే సులభంగా పొందవచ్చు. అక్కడ బాకు, షెకి, అస్తారా, క్యూబా వంటి ప్రదేశాలున్నాయి. అందమైన హిల్ స్టేషన్ గా పేరుపొందిన మనాలి.. ఫొటో షూట్ కు అద్భుతమైన ప్రాంతం. 2024లో భారీ సంఖ్యలో టూరిస్టులు మనాలిని సందర్శించారు.
స్థానం | పర్యాటక ప్రాంతం | దేశం |
1 | అజర్ బైజాన్ | అజర్ బైజాన్ |
2 | బాలి | ఇండొనేషియా |
3 | మనాలి | భారత్ |
4 | కజకిస్థాన్ | కజకిస్థాన్ |
5 | జైపూర్ | రాజస్థాన్ |
6 | జార్జియా | జార్జియా |
7 | మలేషియా | మలేషియా |
8 | అయోధ్య | భారత్ |
9 | కశ్మీర్ | భారత్ |
10 | సౌత్ గోవా | భారత్ |