భారతదేశ కంపెనీకి చెందిన రెండు బీర్ బ్రాండ్లకు ప్రపంచ గుర్తింపు లభించింది. వరల్డ్ బీర్ అవార్డ్స్-2025కు గాను ‘సింబా విట్(Wit)’కు రజతం, ‘సింబా స్టౌట్(Stout)’కు కాంస్యం దక్కాయి. వరల్డ్ బీర్ అవార్డ్స్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత గొప్ప మద్యం తయారీ పోటీల్లో ఒకటి. బ్రూవర్లు, రచయితలు, పరిశ్రమ నిపుణులు కలిసి విజేతను నిర్ణయిస్తారు. గోధుమ మాల్ట్, కొత్తిమీర, నారింజ తొక్కలతో బెల్జియన్ శైలిలో విట్ బ్రాండ్.. రోస్టెడ్ బార్లీ, డార్క్ మాల్ట్ తో స్టౌట్ బీర్లు ప్రత్యేక రుచులతో తయారవుతున్నాయి. ఇశ్వరాజ్ సింగ్ భాటియా, ప్రభ్ తేజ్ సింగ్ భాటియా 2016లో రాయపూర్ లో సింబా బీర్లను ప్రారంభించారు.