
‘ఆపరేషన్ సిందూర్’తో భారత రక్షణ సామర్థ్యం ప్రపంచానికి తెలియడమే కాదు.. ఇక్కడి ఆయుధాలపై ఎనలేని నమ్మకం కలిగింది. అందుకే వాటిని కొనేందుకు 100 దేశాలు ఆసక్తి చూపించాయి. 2025-26లో రక్షణ ఎగుమతులు రూ.38,424 కోట్లుగా ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే 62.66% వృద్ధి నమోదైంది. 2024-25లో రూ.24,000 కోట్ల ఆయుధాలు అమ్ముడయ్యాయి.
చైనా, అమెరికా జెట్లు విఫలమైన వేళ భారత్ మాత్రం పాకిస్థాన్లో అనుకున్న లక్ష్యాల్ని పూర్తి చేసింది. ఒక్క ప్రయోగం కూడా విఫలం కాలేదు. చడీచప్పుడు లేకుండా అర్థరాత్రి పూట కొన్ని నిమిషాల వ్యవధిలోనే టార్గెట్ ను ఛేదించి శభాష్ అనిపించాయి. అందుకే భారత ఆయుధ సామగ్రికి ప్రపంచ దేశాల్లో గుర్తింపు పెరిగింది.