ముగ్గురు భారత అపర కుబేరుల సంపాదనే సింగపూర్ GDPని దాటిపోయింది. ఈ విషయాన్ని బార్ క్లేస్ ప్రైవేట్ క్లయింట్స్ హరూన్ ఇండియా నివేదిక తెలిపింది. అంబానీ కుటుంబం 309 బిలియన్ డాలర్లు(రూ.25.8 లక్షల కోట్లు), బజాజ్ కుటుంబం రూ.7.1 లక్షల కోట్లు, కుమార మంగళం బిర్లా రూ.5.4 లక్షల కోట్లతో నిలిచాయి.
అంబానీ, బజాజ్, బిర్లా కుటుంబాల ఆదాయం 460 బిలియన్ డాలర్లు కాగా.. ఇది సింగపూర్ GDP కన్నా ఎక్కువ కావడం విశేషం. రూ.15.4 లక్షల కోట్ల ఆదాయమున్నా ఈ లిస్టులో అదానీ కుటుంబానికి చోటు దక్కలేదు. మొదటి తరం(First Generation) ఎంటర్ ప్రెన్యూర్స్ ఆధారంగానే ఈ లెక్కల్ని నిర్ణయించారు.
బిజినెస్ ఫ్యామిలీస్-2024 ప్రకారం భారత కుబేరుల సంపాదన 1.3 ట్రిలియన్ డాలర్లు కాగా.. ఇది స్విట్జర్లాండ్, UAE దేశాల GDPతో సమానం. రూ.2,700 కోట్లున్న వ్యాపారవేత్తల్ని పరిగణలోకి తీసుకోగా.. మొత్తంగా 124 కుటుంబాలు 1 ట్రిలియన్ డాలర్లను దాటినట్లు రిపోర్ట్ తెలిపింది.